Salman Rushdie: దాడి చేసింది ఆ యువకుడే.. ఇరాన్‌లో హీరోగా కీర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Details Of Hadi Matar Who Attacked Salman Rushdie: న్యూయార్క్ నగరంలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే! అతడ్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు కానీ.. అతను ఎవరు? ఎందుకు చంపాడు? అనే విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువకుడి పేరు హాదీ మతార్. అతడి వయసు 24 ఏళ్లు. అమెరికా న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూ ప్రాంతంలో నివసిస్తుంటాడు. అతడు ఏ దేశానికి చెందినవాడో స్పష్టత రాలేదు కానీ.. కొన్ని ఆధారాల దృష్ట్యా ఇరాన్‌కి చెందినవాడు అయ్యుండొచ్చని తెలుస్తోంది.
హాదీ మతార్ ఫోన్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ ఖాసిమ్ సులేమానీ (2020లో హత్యకు గురయ్యాడు) ఫొటోని పోలీసులు గమనించారు. దాంతో.. అతడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు సానుభూతిపరుడు అయ్యుంటాడని భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా అతనికి ఏ గ్రూపుతోనూ సంబంధాలు లేవని తేలింది. ఫేస్‌బుక్ పోస్టుల ఆధారంగా.. అతడు షియా అతివాద ధోరణుల పట్ల ఆకర్షితుడై ఉంటాడని అర్థమవుతోంది. తన సొంత సిద్ధాంతాలతోనే అతడు ఒంటరిగానే ఈ కార్యాచరణకు దిగి ఉంటాడని అనుకుంటున్నారు.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రష్దీ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. రష్దీపై దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులకు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు దొరికాయి. వాటిని విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలావుండగా.. 80వ దశకంలో రష్దీ రాసిన ‘ద శాటానిక్ వర్సెస్’ అనే పుస్తకం.. ఇరాన్ అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ పుస్తకాన్ని 1988లో నిషేధించడమే కాదు.. రష్దీని చంపేయాలంటూ ఫత్వా కూడా జారీ చేసింది. ఇప్పుడు రష్దీపై హాదీ మతార్ దాడి చేయడంతో.. అతడ్ని ఇరాన్‌లో హీరోగా కీర్తిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..