China Covid: చైనాకు ఊరట.. కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China says Covid deaths down by nearly 80 percent: ఇంతకాలం కరోనా దెబ్బకు అతలాకుతలమైన చైనాకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. ఆ దేశంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. జనవరి మొదట్లో పీక్ స్టేజ్‌లో కేసులు, మరణాలు సంభవించగా.. ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. రిపోర్ట్స్ ప్రకారం.. జనవరి మొదటి వారంతో పోలిస్తే కరోనా కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గాయి. ఈ విషయాన్ని చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. ఇటీవల ఓ ప్రభుత్వ శాస్త్రవేత్త చైనాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని, ఇప్పటికే చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, త్వరలోనే మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసేందుకే.. చైనా ప్రభుత్వం తాజాగా కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. జనవరి 4వ తేదీన 1,28,000 కరోనా రోగులుండగా, జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. జనవరి మొదట్లో రోజుకు 4,273 మరణాలు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగ్యుల సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు తగ్గింది.
Shardul Thakur: వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
కాగా.. గతేడాది చైనాలో కరోనా విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే! మరీ ముఖ్యంగా.. అక్కడ జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత కేసులు గణనీయంగా పెరిగాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోగా.. స్మశానవాటికల ముందు శవాలు క్యూ కట్టేశాయి. ఇది చూసి.. చైనాలో రానున్న రోజుల్లో మరింత దుర్భర పరిస్థితులు వెలుగుచూస్తాయని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. చైనావ్యాప్తంగా కేసులతో పాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరగొచ్చని అంచనాలూ వచ్చాయి. అయితే.. చైనా ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందంటూ తాజాగా అధికారిక లెక్కల్ని వెల్లడించింది. అయితే.. చైనా వెల్లడించిన వివరాలపై నమ్మకం లేదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే సందేహాలు వ్యక్తపరిచింది. తన ప్రతిష్టని కాపాడుకోవడం కోసం చైనా సరైన లెక్కల్ని తెలపడం లేదని, దీంతో అక్కడి మహమ్మారి తీవ్రతను పసిగట్టలేకపోతున్నాయని WHO చెప్పింది.
Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..