China: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చైనా మధ్యవర్తిత్వం.. టిబెట్‌లో సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది. పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ మధ్య భారత్ సరిహద్దుల్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో చైనా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న శత్రుత్వం, దిగజారిన దౌత్య సంబంధాలను దారిలో పెట్టాలని చైనా భావిస్తోంది.
Also Read
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
Read Also: Covid-19: సింగపూర్‌లో మరో కోవిడ్ వేవ్.. ఆరోగ్య మంత్రి హెచ్చరికలు
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లోని పలు పట్టణాలు, నగరాలపై ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నాయని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్‌లో శరణార్థులుగా ఉన్న ఆఫ్ఘన్లను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. తమ దేశంలో ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘన్ పౌరులే కారణమని పాక్ ఆరోపిస్తోంది. అయితే పాక్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ తోసిపుచ్చింది.
తాజా సమావేశాలు 2018లో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, మంగోలియా, చైనా సభ్యులుగా ఏర్పడిన ట్రాన్స్-హిమాలయన్ ఫోరమ్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లో భాగంగా జరిగాయి. అయితే చైనా మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టును ఆధునీకీకరించి సీపెక్ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ అంతటా రోడ్లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి చైనాతో అనుసంధానిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో చమురు అణ్వేషన, లిథియం మైనింగ్ పై చైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటేనే తమ దోపిడికి అడ్డు ఉండదని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలననను గుర్తించనప్పటికీ.. చైనా మాత్రం కాబూల్ లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి రాయబారిని నియమించింది.
- Tags
- Afghanistan
- china
- Pakistan
- Taliban
- tibet
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!