చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్లు ఉన్నాయి.
ప్రజాస్వామ్య తైవాన్ కూడా చైనాలో భాగమే అని చైనా వాదిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా వన్ చైనా విధానానికి కట్టుబడాలంటూ హెచ్చరిస్తోంది. చైనా తైవాన్‌కు అండగా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు నిలవడం చైనాకు నచ్చడం లేదు. దీంతో తమ ఆధిక్యతను ప్రదర్శించడానికి ప్రతీ సారి తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతూ తైవాన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలను చైనా చేస్తోంది. గతంలో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ కూడా తైవాన్ ను స్వాధీనం చేసుకోవడంతోనే చైనా పునరేకీకరణ పూర్తవుతుందని ప్రకటించాడు.