China VS Taiwan: తైవాన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లతో తైవాన్ ద్వీపాన్ని చుట్టుముడుతోంది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ). తైవాన్ అధ్యక్షురాలు అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తో భేటీ కావడం చైనాకు రుచించలేదు. ఈ చర్య అనంతరం తైవాన్ ను కబలించేందుకు చైనా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం భారీ ఎత్తున తైవాన్ కు సమీపంలో చైనీస్ ఆర్మీ యుద్ధ విన్యాసాలను చేపట్టింది.
తైవాన్ ద్వీపం చుట్టూ 8 చైనా వార్ షిప్స్, 42 ఫైటర్ జెట్లను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 29 యుద్ధవిమానాలు తైవాన్ నైరుతి వైమానిక రక్షణ జోన్ లోకి ప్రవేశించాయి. ఈ ఏడాదిలో ఒకే సారి ఇన్ని యుద్ధవిమానాలు రావడం ఇదే తొలిసారి. చైనా ఆర్మీ తూర్పు థియేటర్ కమాండ్ తైవాన్ జలసంధిలో యుద్ద సన్నాహాల్లో భాగంగా పెట్రోలింగ్ ప్రారంభించింది. తైవాన్ చుట్టూ ఉత్తరం, దక్షిణం, తూర్పు నుంచి చుట్టుముడుతోంది. దీర్ఘ శ్రేణి రాకెట్, డిస్ట్రాయర్లు, యుద్దనౌకలు, ఫైటర్లు, బాంబర్లు, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ఎయిర్ క్రాప్ట్స్, సంప్రాదాయ క్షిపణలును మోహరించింది.
Read Also: Bharat Express Train: తమిళనాడులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించిన ప్రధాని మోడీ
గతేడాది యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసి వచ్చిన సందర్భంలో కూడా చైనా ఇలాగే తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఇదిలా ఉంటే ఇటీవల తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ మార్చి 30న అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన తర్వాత యూఎస్ఏ స్పీకర్ కెవిన్ మెకార్తీ ఆతిథ్యం ఇచ్చారు. కొన్ని దశాబ్ధాల తర్వాత ఓ తైవాన్ అధ్యక్షురాలిలో అమెరికా సీనియర్ నాయకుడు భేటీ కావడం ఇదే తొలిసారి.
తైవాన్, చైనాల మధ్య ఘర్షణ గతేడాది నాన్సీ పెలోసీ పర్యటన తర్వాతే పెరిగింది. వన్ చైనా విధానంలో తైవాన్ భాగం అని, చైనా సార్వభౌమాధికారం కిందకు తైవాన్ వస్తుందని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. అయితే తైవాన్ మాత్రం తాము స్వతంత్ర దేశం అని చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా తన సైనిక శక్తితో తైవాన్ ను భయపెట్టి, లొంగదీసుకోవాలని చూస్తోంది. 1993లో చైనా, తైవాన్ పై మూడో శ్వేతపత్రంలో, 2012లో అధ్యక్షుడిగా షి జిన్ పింగ్ పగ్గాలు చేపట్టిన తర్వాత తైవాన్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సైనిక చర్యలకు కూడా వెనడామని ప్రకటించారు. అయితే చైనాకు వ్యతిరేకంగా తైవాన్ కు అమెరికా అండగా నిలుస్తోంది.