India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఇండియా, కెనడాల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చింది. అీయితే ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాద అంశమే చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల జీ20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చి వెళ్లిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ సమయంలో భారత ప్రధాని మోడీతో ట్రూడో ద్వైపాక్షి సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా ప్రధాని మోడీ ఖలిస్తాన్, కెనడా కేంద్రంగా భారత వ్యతిరేకతకు పాల్పడుతున్న చర్యలను ముఖ్యంగా ప్రస్తావించారు. భారత రాయబార కార్యాలయాలు, భారత్ దౌత్యవేత్తలపై దాడులు, భారతీయులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని ముందే మోడీ తన బలమైన సందేశాన్ని వ్యక్తపరిచారు.
Also Read
- London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం అవసరమని మోడీ ప్రస్తావించారు. చర్చల అనంతరం కెనడా పీఎం ట్రూడో మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశం శాంతియుత నిరసనలు తెలిపే స్వేచ్ఛను కాపాడుతుందని, అదే సమయంలో హింసను అడ్డుకుంటుందని అన్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదం గురించి పరోక్షంగా మాట్లాడుతూ కొద్ది మంది చర్యలు కెనడాకు పాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు.
గత కొంత కాలంగా కెనడాలో భారత్ లోని పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేసి ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు సిక్కులు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీని పేరుతో ‘ఖలిస్తాన్ రెఫరెండం’ నిర్వహిస్తున్నారు. సర్రే, వాంకోవర్, టొరంటో వంటి ప్రాంతాల్లో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ..ఏకంగా ప్రధాని మోడీ, మంత్రులు అమిత్ షా, జైశంకర్లను బెదిరించే స్థాయికి చేరారు. చాలా సార్లు భారత ప్రభుత్వం కెనడాను చర్యలు తీసుకోవాలని కోరినా, అక్కడి ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జూన్ నెలలో ఓ కార్యక్రమంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లు ప్రతిబింబించే శకటాన్ని ఏర్పాటు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్‌ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
-
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
-
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
-
Bandla Ganesh: ‘పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే’.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!