Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Canada Government Printing Warning Message On Cigarette

Smoking: ఇకపై సిగరెట్ల పైనే.. తాగితే పోతారు!

Published Date :June 13, 2022 , 9:44 pm
By NTV WebDesk
Smoking: ఇకపై సిగరెట్ల పైనే.. తాగితే పోతారు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం.. కళ్లు అరిగేలా, చెవులు చిల్లుపడేలా ప్రకటనలు వేస్తున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. అంతెందుకు.. సిగరెట్ ప్యాక్ మీదే హెచ్చరిక సందేశాలున్నా బేఖాతరు చేస్తున్నారు. సిగరెట్ తీసుకొని, ప్యాకెట్‌ను పక్కన పడేసి, గుప్పుగుప్పుమంటూ పొగ వదిలేస్తున్నారు. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలంటే.. సిగరెట్ ప్యాక్‌లపై ఉండే సందేశాలకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. అందుకే, కెనడా ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి, నేరుగా సిగరెట్లపైనే హెచ్చరికల్ని ముద్రించాలని నిర్ణయించింది.

‘‘సిగరెట్ ప్యాక్‌లపై ఉంటే హెచ్చరిక సందేశాలు కొత్తదనాన్ని, ప్రభావాన్ని దాదాపు కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పరిష్కార మార్గానికి తెరలేపాల్సి వచ్చింది. ఇక నుంచి సిగరెట్ల మీదే ‘పొగారు ఆరోగ్యానికి హానికరం’ అనే సందేశాన్ని ముద్రించాలని డిసైడ్ అయ్యాం. ప్యాకెట్‌లో ఉన్న సిగరెట్లను తాగుతున్నారే తప్ప, ఆ ప్యాక్‌లపై ఉన్న హెచ్చరికని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సిగరెట్‌పై హెచ్చరికని ముద్రించాలని అనుకుంటున్నాం’’ అని కెనడా ఆరోగ్యం, వ్యసనాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 మధ్య కల్లా ఈ మార్పుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అంతేకాదు.. ‘‘ప్రతీ పఫ్‌లోనూ విషం ఉంది’’ అనే హెచ్చరికను సైతం సిగరెట్‌పై ఉంచాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. ‘‘ఈ హెచ్చరికను ఎవరూ తోసిపుచ్చలేరు, ప్రతి స్మోకర్‌కు ప్రతి పఫ్ మీద ఈ హెచ్చరకి తప్పకుండా కనిపిస్తుంది’’ అని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.

Also Read

  • Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
  • US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
  • Vladimir Putin: పుతిన్‌కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
  • Norovirus Outbreak: క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం.. 115 మందికి అస్వస్థత
Add as a preferred
source on google

ఈ తరహా విధానం ఏ దేశమూ అమలు చేయలేదని, తొలిసారి కెనడానే అమలు చేస్తోందని ఆయనన్నారు. కాగా.. కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 10 శాంతి మంది కెనడియన్లు క్రమం తప్పకుండా స్మోకింగ్ చేస్తున్నారు. అలాగే, పోగాకు సంబంధిత రోగాలతో ప్రతి ఏటా 48 వేల మంది చనిపోతున్నారు. 2035 నాటికి ఈ పొగ తాగే రేటుని సగానికి తగ్గించాలన్న ఉద్దేశంతో, కెనడా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada government
  • Canada Health Ministry
  • Cigarette Warning Message
  • Cigarettes
  • Cigars

తాజావార్తలు

  • Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..

  • Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు

  • Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్

  • BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ రాజకీయాలతో సంబంధం..

  • Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions