పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం.. కళ్లు అరిగేలా, చెవులు చిల్లుపడేలా ప్రకటనలు వేస్తున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. అంతెందుకు.. సిగరెట్ ప్యాక్ మీదే హెచ్చరిక సందేశాలున్నా బేఖాతరు చేస్తున్నారు. సిగరెట్ తీసుకొని, ప్యాకెట్‌ను పక్కన పడేసి, గుప్పుగుప్పుమంటూ పొగ వదిలేస్తున్నారు. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలంటే.. సిగరెట్ ప్యాక్‌లపై ఉండే సందేశాలకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. అందుకే, కెనడా ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి, నేరుగా సిగరెట్లపైనే హెచ్చరికల్ని ముద్రించాలని నిర్ణయించింది. ‘‘సిగరెట్ ప్యాక్‌లపై ఉంటే హెచ్చరిక…