Site icon NTV Telugu

భారత్‌ విమానాలపై మరోసారి నిషేధం పొడిగింపు

flights

కరోనా మహమ్మారి విజృంభణతో విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి… కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో.. కొన్ని దేశాలు.. ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి… విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి.. కానీ, భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం… సెప్టెంబర్‌ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది.. వాణిజ్య, ప్రైవేట్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తుండగా.. కార్గో, మెడికల్‌ వస్తువుల రవాణా, మిలటరీ విమానాలకు మినహాయింపును ఇచ్చింది. కెనడా ప్రభుత్వం ఎపిడెమియోలాజికల్‌ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది కెనడా.

Exit mobile version