Justin Trudeau: అమెరికాని ఓడించిన కెనడా.. ట్రంప్‌కి ట్రూడో స్ట్రాంగ్ రిఫ్లై..
- "మీరు మా దేశాన్ని తీసుకోలేరు"..
- ఐస్ హాకీలో అమెరికాపై కెనడా విజయం..
- ట్రంప్‌కి స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చిన జస్టిన్ ట్రూడో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెనడాని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోని టార్గెట్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రం కలపాలంటూ, ట్రూడో గవర్నర్ గా ఉండాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా ఫోర్ నేషన్స్ ఫేస్-ఆఫ్ ఫైనల్లో కెనడా, అమెరికా ఐస్ హాకీలో తలపడ్డాయి. ఈ పోటీలో అమెరికాను కెనడా ఓడించింది.
Read Also: Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు
Also Read
బోస్టన్‌లో జరిగిన ఐస్ హాకీ మ్యాచ్‌లో కెనడా 3-2 తేడాతో గెలిచిన కొద్దిసేపటికి ట్రూడో ఎక్స్ వేదికగా ట్రంప్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘‘మీరు మా దేశాన్ని తీసుకోలేరు. మీరు మా ఆటను తీసుకోలేరు’’ అని పోస్ట్ చేశారు. ట్రంప్ పదేపదే కెనడా గురించి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ట్రూడో హాకీ మ్యాచ్‌ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఫైనల్‌కి ముందు ట్రంప్ అమెరికా జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కెనడా అమెరికాకు ‘‘51వ రాష్ట్రం’’గా మారాలనే కోరికను మరోసారి వెలిబుచ్చారు. ‘‘కెనడాపై అమెరికా గెలవాలి. ఏదో రోజు బహుశా త్వరలో, మన ప్రియమైన చాలా ముఖ్యమైన 51 రాష్ట్రంగా మారుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, అమెరికా గవర్నర్ల సమావేశానికి ముందు, గవర్నర్ ట్రూడో మాతో చేరాలనుకుంటే ఆయనకు స్వాగతం అంటూ మరోసారి కెనడా ప్రధాని ట్రూడోపై వ్యంగ్యంగా మాట్లాడారు.
You can’t take our country — and you can’t take our game.
— Justin Trudeau (@JustinTrudeau) February 21, 2025
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!