Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Boeings Troubled Capsule Returns To Earth Empty 2 Astronauts Left Behind In Space

Boeing Starliner: ఖాళీగా భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌..?

Published Date :September 7, 2024 , 1:57 pm
By Chandra Shekhar Pamena
  • వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగొచ్చిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌..
  • అంతరిక్షంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్.. బుచ్‌ విల్‌మోర్‌..
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్.. విల్‌మోర్‌లను భూమిపైకి తెచ్చేందుకు నాసా ఏర్పాట్లు..
Boeing Starliner: ఖాళీగా భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Boeing Starliner: ప్రముఖ సంస్థ బోయింగ్‌ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసిపోయింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్‌ కిందకు రావాల్సి వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక భూమిని చేరుకుంది. బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా ఈ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ జూన్‌ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం లేట్ అవుతుంది.

Read Also: Kejriwal: లిక్కర్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్‌ భాగస్వామి: సీబీఐ

ఇక, సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్‌.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్‌ సురక్షితమేనని చెప్పుకొచ్చింది. కానీ, నాసా అందుకు ఒప్పుకోకపోవడంతో.. స్టార్‌లైనర్‌ ఖాళీగా తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన ఆరు గంటల తర్వాత న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌లో ఈ క్యాప్సుల్‌ సురక్షితంగా ల్యాండ్ అయింది. వ్యోమగాముల కోసం స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌకను రెడీ చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీతా, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిందే. స్పెక్స్‌ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్‌ఎస్‌కు పంపించే ఛాన్స్ ఉంది. ఈ సెప్టెంబరులోనే ప్రయోగం ఉండొచ్చని తెలుస్తుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, విల్‌మోర్‌ను భూమీ పైకి తీసుకురావాలని నాసా భావిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • astronauts
  • Boeing
  • Boeing Starliner
  • nasa
  • Space

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions