Blood Money: ఉరిశిక్ష నుంచి కేరళ నర్సును రక్షించాలంటే ‘బ్లడ్ మనీ’ ఒక్కటే మార్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Money: కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసిన కేసులో 2017లో ఆమెకు శిక్ష విధించింది. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆమె చేసుకున్న అప్పీల్‌ని తిరస్కరించింది. అయితే ఇండియాలో ఉన్న ఆమె తల్లి మాత్రం కూతురు ప్రాణాల కోసం పోరాడుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో తాను యెమెన్ వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రియ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది.
ఇదిలా ఉంటే ఈ కేసు నుంచి ప్రాణాలతో నిమిష ప్రియ బయటపడాలంటే కేవలం ‘బ్లడ్ మనీ’తో మాత్రమే సాధ్యమని న్యాయవాది సుభాష్ చంద్రన్ తెలిపారు. యెమెన్‌లో షరియా చట్టాన్ని పాటిస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే బాధిత కుటుంబంతో నేరుగా చర్చలు జరపడమే మార్గమని, వారికి నష్టపరిహారానికి ఒప్పుకుని క్షమాభిక్ష పెడితేనే ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకోగలదని చెప్పారు.
అయితే అది అనుకున్నంత సులభం కానది చంద్రన్ వెల్లడించారు. 2016 నుంచి యెమెన్‌కి ప్రయాణ నిషేధం ఉంది. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లలేం. దీని కారణంగానే ప్రియ తల్లి యెమెన్ వెళ్లి భాదిత కుటుంబంతో చర్చించలేకపోతోందని అన్నారు.
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
‘బ్లడ్ మనీ’ అనేది హత్య చేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం. దీనిపై శిక్ష పడిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబంతో చర్చించాల్సి ఉంటుంది. అయితే గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రియ తల్లి యెమెన్ వెళ్లే అంశంపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
కేసు వివరాలు ఇవే:
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియా కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం యెమెన్ వెళ్లింది. 2014లో ఆమె భర్త, కూతురు తిరిగి ఇండియాకు వచ్చారు. అయితే నిమిష మాత్రం ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోయింది. ఆ దేశానికి చెందిన తలాల్ మహ్దీ సాయంతో అక్కడే ఓ క్లినిక్ ప్రారంభించింది. కాగా కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. నిమిష ప్రియను అతను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా ఆమె పాస్‌పోర్టును లాక్కున్నాడు. తన పాస్ పోర్టును తిరిగి పొందాలనే ఉద్దేశంతో నిమిష అతనికి మత్తుమందు ఇచ్చింది. ఇది ఓవర్ డోస్ కావడంతో అతను మరణించాడు. ఏం చేయాలో తెలియక హత్య విషయాన్ని వేరే వ్యక్తికి చెప్పింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని మాయం చేశారు. నాలుగు రోజుల తర్వాత వారి నేరం బయటకు రావడంతో ఇద్దర్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో యెమెన్ కోర్టు నిమిష ప్రియకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!