మరో కీలక నిర్ణయం తీసుకున్న తాలిబన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం.. తాలిబన్లను అనుమానంతో చూడడం మొదలు పెట్టింది.
ఉగ్రవాదులుగా ఉండడం వేరు.. పాలించడం వేరు.. ఈవిషయం కాస్త ఆలస్యంగా తాలిబన్లకు అర్థమైంది. ఓవైపు కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి. అఫ్ఘాన్ల ఆకలి కేకలు, అంతర్జాతీయ సమాజం నుంచి అందని సహకారం వెరసి, తాలిబన్లను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీనికి తోడు తాలిబన్లలోని వివిధ వర్గాలు సైతం పరస్పర విభేదాలతో ఉన్నాయి. పేదరికం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి.
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
అప్పుకింద అమ్మాయిలను చెల్లించడం, విక్రయించడం అక్కడ అనాదిగా వస్తోంది. అంతేకాదు, అక్కడి గిరిజన తెగల్లోని మహిళలు భర్త చనిపోతే అతడి అన్నదమ్ముల్లో ఒకరిని చేసుకోవాలన్న నియమం కూడా ఉంది. తాజాగా, తాలిబన్లు జారీ చేసిన ఆదేశాలతో వీటన్నింటికీ చెక్ పడనుంది. అంతేకాదు, భర్తను కోల్పోయిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా తాలిబన్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.నిజానికి ఆప్ఘనిస్థాన్ తిరిగి తాలిబన్ల వశమయ్యాక ఎక్కువగా భయపడింది ఆ దేశంలోని మహిళలే. వారిపై కఠిన ఆంక్షలు ఉంటాయని అందరూ భావించారు. అణచివేత, వేధింపులు తప్పవని భయపడిపోయారు. దీంతో చాలామంది దేశం విడిచి పారిపోయారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ తాలిబన్లు మహిళల వివాహం విషయంలో.. తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
- Tags
- Afghanisthan
- talibans
- Womens
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?