California Storm: తుఫాన్ బీభత్సం.. కాలిఫోర్నియా అతలాకుతలం.. 19 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biden Declares Disaster As New Storms Hit Flooded California 19 Died: తుఫాన్ కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియా అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల ధాటికి వరదలు ఉప్పొంగి, డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. ఈ దెబ్బకు అక్కడ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వేలాదిమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చూసి ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. వరదల దెబ్బకు చివరికి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. చాలాచోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. చాలాచోట్ల వివిధ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఆస్తినష్టం తీవ్రంగా చోటు చేసుకుంది. ఈ ప్రమాదాల కారణంగా 19 మంది చనిపోయారని కూడా వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సోమవారం సైతం తుఫాన్ ముప్పు ఉండటంతో.. ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
Rajamouli: మన సినిమా గురించి మాట్లాడిన అవతార్ డైరెక్టర్… అదిదా సర్ రేంజ్
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని ఈ పరిస్థితిని భారీ విపత్తుగా అభివర్ణించారు. ఈ శీతాకాలపు తుఫాన్, వరదలు, కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జో బైడెన్ ప్రకటించిన డిక్లరేషన్‌లో భాగంగా.. బాధితులకు సమాఖ్య నిధులు, తాత్కాలిక గృహాలు అందజేయడం జరుగుతుంది. అటు.. గత మూడు వారాల్లో తుఫాను సంబంధిత కారణాలతో 19 మంది చనిపోగా.. కార్లు నీటమునగడం వల్ల, డ్రైవర్లు, చెట్లు కూలిపోయి మీద పడటంతో వ్యక్తులు, కొండచరియలు విరిగిపడి భార్యాభర్తలు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల నీటిస్థాయి గణనీయంగా పెరగడంతో.. ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆపేశారు. మరికొన్ని చోట్ల వరదలు భారీగా పారుతుండటంతో.. ఆయా ప్రాంతాల నుంచి వెళ్లడానికి వీలు లేక, కొందరు జనాలు తమ స్వగృహాల్లోనే ఉండిపోయారు. ఆదివారం ఉదయం వరకు 1600 కన్నా ఎక్కువ గృహాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే ఉండిపోయాయి. ఒక రైతు మాట్లాడుతూ.. తమ ప్రాంతం చాలాకాలం నుంచి కరువులోనే ఉందని, ఇంత భారీ వర్షం తమకు అలవాటు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. వర్షం 5.0 నుండి 7.5 సెంటీమీటర్ల మేర కురిస్తే మాత్రం.. వరదలు మరింతగా రావొచ్చని ఎన్ఎస్‌డబ్ల్యూ పేర్కొంది. సియెర్రా నెవాడాలోని కొన్ని ప్రాంతాలలో మూడు నుండి ఆరు అడుగుల మంచు కురుస్తుంది.
Indigo Emergency Landing: విమానంలో విషాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా..
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!