Rajamouli: మన సినిమా గురించి మాట్లాడిన అవతార్ డైరెక్టర్… అదిదా సర్ రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క మాట ‘జేమ్స్ కమరూన్’. టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో జేమ్స్ దిట్ట. థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చెయ్యడంలో జేమ్స్ కమరూన్ ని మించిన డైరెక్టర్ మరొకరు ఈ సినిమా ప్రపంచంలోనే లేరు. నో, నో… ఒకరున్నారు. థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే ఆడియన్స్ ని మాత్రమే కాదు ఇంట్లో కూర్చోని ఒటీటీలో సినిమాలు చూసే వాళ్లకి కూడా ఫుల్ మీల్స్ పెట్టగల ఆ దర్శకుడు మన రాజమౌళి. జక్కన్నగా మనం అంతా ప్రేమగా పిలుచుకునే రాజమౌళి, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు మాత్రమే కాదు ఈరోజు ఆయన వరల్డ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు.
ఇంఫాక్ట్ చెప్పాలి అంటే జేమ్స్ కమరూన్ తర్వాత ఎమోషన్స్ అండ్ విజువల్ గ్రాండియర్ రెండింటినీ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసి చూపించగల ఏకైక దర్శకుడు రాజమౌళి మాత్రమే. అంతటి రాజమౌళి, జేమ్స్ కమరూన్ లు కలిస్తే ఎలా ఉంటుంది? మన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అవతార్ లాంటి మాస్ పీస్ సినిమా తీసిన దర్శకుడు ఏం మాట్లాడి ఉంటారు? ఆయనకి మన విజువల్స్ నచ్చి ఉంటాయా? మన ఎమోషన్స్ ఎక్కి ఉంటాయా? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానం. జేమ్స్ కమరూన్ మన ఆర్ ఆర్ ఆర్ సినిమాని చూసారు, ఆయనకి నచ్చింది, దాదాపు 10 నిమిషాల పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించే మాట్లాడారు. జేమ్స్ కమరూన్ చూడడం మాత్రమే కాదు ఆయన తన వైఫ్ ‘సుజీ’ని కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడామణి చెప్పి, సుజీ చూసే సమయంలో జేమ్స్ మళ్లీ రెండో సారి ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశారు. ఈ విషయాన్ని మేము చెప్పట్లేదు అండి, రాజమౌళినే స్వయంగా ట్విట్టర్ లో జేమ్స్ కమరూన్ కి కలిసిన ఫోటోలు పోస్ట్ చేసి మరీ చెప్పాడు.
Also Read
- Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. 'స్వాభిమానం' మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
- Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
- Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
ఒకసారి అటు వైపు ఒక లుక్కేయండి, ఇద్దరు దిగ్గజ దర్శకులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు. ఆ ఫోటోని చూడగానే ‘అదిదా సార్ రేంజ్’ అని రాజమౌళి గురించి ఎవరైనా అనాల్సిందే. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమాకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్ లో రన్నర్ గా నిలిచింది.
The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻
Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD… Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa
— rajamouli ss (@ssrajamouli) January 16, 2023
తాజావార్తలు
-
IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
-
Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
-
CM Revanth Reddy: వైద్యం కోసం ఏ పేద కుటుంబమూ అప్పులపాలు కాకూడదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
Personal Loan Interest Rates: ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ వడ్డీ తక్కువ? ఆ బ్యాంకుల మధ్య పోలిక ఇదే..!
-
OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!