Bangladesh: బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్‌ల బెదిరింపులు..
- బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ వివాదం..
- మతోన్మాదుల బెదిరింపులతో ఆగిన నిర్మాణం..
- కూల్చేస్తామని హెచ్చరిస్తున్న రాడికల్ ఇస్లామిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో నిర్మితమవుతున్న అతిపెద్ద ‘‘శ్రీరాముడి విగ్రహం’’ వివాదానికి కేంద్రంగా మారింది. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న గైబంధా జిల్లాలో నిర్మిస్తున్న 81 అడుగుల ఎత్తైన విగ్రహం పనుల్ని తీవ్రవాద ఇస్లామిక్ వర్గాలు బెదిరింపుల కారణంగా నిలిపేశారు. ఈ విగ్రహాన్ని నిర్మించవద్దని రాడికల్ ఇస్లామిక్ మూకలు ర్యాలీలు, నిరసనలు చేశాయి. ఈ పరిణామాలు అక్కడి హిందువుల్లో, మైనారిటీల వర్గాల్లో భయాందోళనలు పెరిగాయి. మైనారిటీ మతస్వేచ్ఛ బంగ్లాదేశ్‌లో ప్రశ్నార్థకంగా మారింది.
భారీ విగ్రహ నిర్మాణానికి అవాంతరాలు:
పలాశ్బారి ప్రాంతంలోని శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ సముదాయంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. సమారు 220 మిలియన్ టాకాలు అంటే సుమారుగా రూ. 15.6 కోట్ల వ్యయంతో ఈ శ్రీరాముడి భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. రాముడి విగ్రహంతో పాటు 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా నిర్మించాల్సి ఉంది. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇస్లామిక్ సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ చెప్పారు.
Also Read
విగ్రహం ధ్వంసం చేయాలని ఇస్లామిస్టుల పిలుపు:
షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడి మారాడు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో జమాతే ఇస్లామి వంటి మతోన్మాద సంస్థలపై నిషేధాన్ని ఎత్తేశాడు. అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరిగింది. శ్రీరాముడి విగ్రహ నిర్మాణంపై ఆ దేశంలోని మతోన్మాద మత బోధకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒక మౌలానా మాట్లాడుతూ.. విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చకపోతే, ముస్లింలే దాన్ని ధ్వంసం చేస్తారని హెచ్చరించాడు. ఈ పరిస్థితుల్లో చట్ట వ్యవస్థ, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు తాత్కాలికంగా నిర్మాణాన్ని నిలిపేస్తున్నట్లు ఆలయ కమిటి ప్రకటించింది. తాము ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదని, ఎవరి మత భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని ఆలయ కమిటీ చెబుతోంది.
మైనారిటీ విద్యార్థుల ఆందోళన:
ఇదిలా ఉంటే ఇటీవల గైబంధాలో జరిగిన ఇస్లామిస్టుల ర్యాలీలో శ్రీరాముడి చిత్రాన్ని అవిత్రం చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడు విగ్రహాన్ని అవమానించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు వివక్ష ఎదుర్కొంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు, వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ మాట్లాడుతూ.. శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చివేయాలన్న పిలుపు తాలిబాన్ తరహా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!