NTV Telugu Site icon

Chinmoy Krishnadas: బంగ్లాదేశ్‌లో చిన్మయ్‌ కృష్ణదాస్‌తో పాటు మరో 164 మందిపై దేశద్రోహం కేసు

Krishnadas

Krishnadas

Chinmoy Krishnadas: హిందూ ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అయితే, ఆయనపై తాజాగా మరో కేసు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చిట్టగాంగ్‌ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్‌ సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. హెఫాజాత్-ఎ-ఇస్లాం బంగ్లాదేశ్ కార్యకర్త, వ్యాపారవేత్త ఇనాముల్‌ హక్ కంప్లైంట్ చేయడంతో మరో 400- 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం.

Read Also: PM Modi: ఇది టెక్‌, డేటా నడిపించే శతాబ్దం.. అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోంది!

అయితే, నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ఆవరణలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్‌ అనుచరులు తనపై దాడి చేసినట్లు ఇనాముల్‌ హక్ ఆరోపించారు. అయితే, ఈ దాడిలో తన కుడి చేయి, తలకు గాయాలు కావడంతో హస్పటల్ లో చేరినట్లు తెలిపారు. అందుకే ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. మరోవైపు డిసెంబర్‌ 3న ఓ సినిమా హాలు దగ్గర ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇస్కాన్‌ సభ్యులపై దాడి చేశారని ఓ వ్యాపారవేత్త మరో కంప్లైంట్ ఇచ్చారు.

Read Also: Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్

ఇక, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్త, హిందూ సన్మాసి చిన్మయ్‌ కృష్ణదాస్‌ అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ జెండాను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఢాకా ఎయిర్ పోర్టులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో చెలరేగిన ఘర్షణల్లో ఓ లాయర్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో బంగ్లాలో ఇస్కాన్‌ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్‌ వేయగా.. దాన్ని బంగ్లా హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే, కోర్టులో చిన్మయ్ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్లపై ముస్లీంలు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో కృష్ణదాస్‌కు మద్దుతుగా వాదించెందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో బంగ్లాదేశ్‌, భారత్‌ల మధ్య ఉన్న సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి.