India vice captain Smriti Mandhana has joined the Adelaide Strikers for the WBBL 10 season: భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన రాబోయే డబ్ల్యూబీబీఎల్-10 సీజన్ కోసం అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులో చేరింది. ఈ ఎడమచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మందాన ఇదివరకు మూడు మహిళల బిగ్ బాష్ లీగ్ సీజన్ లలో బ్రిస్బేన్ హీట్ (సీజన్ 2), హోబర్ట్ హరికేన్స్ ( సీజన్ 4), సిడ్నీ థండర్ ( సీజన్ 7) తరపున ఆడింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, మంధాన తోపాటు కోచ్ ల్యూక్ విలియమ్స్ సహకారంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్) 2024 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించారు.
Mark Zuckerberg: జో బైడెన్ సర్కార్ మోటాపై తీవ్ర ఒత్తిడి చేశారు..
ఈ సందర్భంగా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మందాన మాట్లాడుతూ.. నేను ఆస్ట్రేలియాలో ఆడటానికి ఇష్టపడతాను. స్ట్రైకర్స్ వంటి విజయాల చరిత్ర కలిగిన జట్టుకు సహకరించే అవకాశం గురించి నేను చాలా సంతోషిస్తున్నానని అన్నారు. ల్యూక్ తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మునుపటి అనుభవాలు చాలా ఉన్నాయి. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. డబ్ల్యుపిఎల్ తో పాటు.. మందాన, స్ట్రైకర్స్ కోచ్ ల్యూక్ విలియమ్స్ గతంలో సదరన్ బ్రేవ్ ఫర్ ది హండ్రెడ్లో కలిసి పనిచేశారు.
ఈ నేపథ్యంలో ల్యూక్ విలియమ్స్ ఆనందం వ్యక్తం చేశారు. స్మృతి ఒక అసాధారణమైన ప్రతిభ. ఆమెను స్ట్రైకర్స్ కు స్వాగతించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె సాంకేతిక నైపుణ్యం, అనుభవం, వ్యూహాత్మక అంతర్దృష్టులు మాకు అద్భుతమైన ఆస్తి అని అన్నారు. జట్టుకు మైదానంలో ఆమె తెచ్చే అంకితభావం, శక్తి నాకు తెలుసు. రాబోయే సీజన్లో విజయం కోసం మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె నైపుణ్యం, నాయకత్వం అమూల్యమైనవి అని అన్నారు. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్ అక్టోబర్ 27 న WBBL10 సీజన్ మొదటి మ్యాచ్ కోసం అడిలైడ్ ఓవల్ బ్రిస్బేన్ హీట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Andhra Pradesh: రిటైరయ్యే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇలా రీ ఎంట్రీ..!
ఆదివారం జరగబోయే మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) డ్రాఫ్ట్ కోసం మొత్తం 19 మంది భారత మహిళా క్రికెటర్లు తమను తాము నామినేట్ చేసుకున్నారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ డ్రాఫ్ట్ కు నామినేట్ అయిన ప్రముఖ పేర్లలో ఉన్నారు. డబ్ల్యూబీబీఎల్ డ్రాఫ్ట్ కు నామినేట్ అయిన భారత ఆటగాళ్ల పూర్తి జాబితాలో.. హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, తితాస్ సాధు, ఆశా శోభనా, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, యస్తికా భాటియా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలతా దయాలన్, సజనా సజీవన్, మన్నత్ కశ్యప్, మేఘనా సబ్బినేని, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, మేఘనా సింగ్ ల పేర్లు ఉన్నాయి.