Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!
- అందరినీ ఆకట్టుకుంటున్న పలువురు యువ ఆటగాళ్లు
- ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?
- ఐపీఎల్ 2026లో తడబడుతున్న భారత టాప్ స్టార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Players Struggle in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో పలువురు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ముకుల్ చౌదరి, అశోక్ శర్మ, ఆయుష్ మాత్రేలు అదరగొడుతూన్నారు. మరోవైపు భారత జట్టుకు కీలకమైన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న ఈ స్టార్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2026లో మాత్రం ఫామ్ కోసం తంటాలు పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెప్పగోదగ్గ ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ తీయకపోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా ఈసారి తేలిపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా వికెట్ కోసం తంటాలు పడుతున్నాడు. అంతేకాదు భారీగా పరుగులు ఇస్తున్నాడు. వైడ్ల రూపంలో కూడా రన్స్ సమర్పించుకుంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో రెచ్చిపోయిన అర్ష్‌దీప్, బుమ్రాలు ఇప్పుడు ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ సీజన్‌లో ప్రభావం చూపలేకపోయాడు. మిస్టరీ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే వరుణ్.. ఇప్పటి వరకు వికెట్ ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంజు శాంసన్ కూడా ఈ సీజన్‌లో ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడు. ప్రతిభావంతమైన బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్ 2026లో యువ ఆటగాళ్లు మెరుస్తుంటే.. అనుభవజ్ఞులైన భారత స్టార్ ప్లేయర్లు మాత్రం ఫామ్ కోసం పోరాడుతున్నారు. ఈ స్టార్ ఆటగాళ్లు త్వరలోనే తిరిగి తమ పాత ఫామ్‌ను అందుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!