Asim Munir: పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. సాధారణంగా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని నేతృత్వంలోని బృందం చర్చల్ని నిర్వహిస్తుంది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఆసిమ్ మునీర్ పలు దేశాల పర్యటనలకు వెళ్లడం, ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడం జరుగుతోంది.
Read Also: Gokarna: మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ.. ఏమైందంటే..
ఇటీవల, ఆసిమ్ మునీర్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. తాజాగా ఆయన శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో పర్యటనలు ఖరారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునే దిశగా సమావేశాలు జరుపుతున్నారు. ఇదంతా చూస్తే ప్రధాని షహజాబ్ షరీఫ్‌ని సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మునీర్ జూలై 21న కొలంబోకు వెళ్లనున్నారు.
ఉగ్రవాదం, జాతీయ సరిహద్దులను కాపాడుకోవడం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC)లో ఇండోనేషియా ముఖ్యమైన అంశాలపై భారతదేశానికి మద్దతు ఇచ్చింది, ఇది పాకిస్తాన్‌ను కలవరపెట్టింది. ముస్లిం దేశాల్లోలనే పాకిస్తాన్‌కు పెద్దగా మద్దతు లేదు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే విషయంలో మునీర్ పర్యటనలు ఉండబోతున్నట్లు సమాచారం. పలు సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో ఇండోనేషియా, భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గణతంత్ర దినోత్సవం కోసం భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన తన పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుని మరీ, ఇండియాలో తన పర్యటనను పొడగించుకోవడం గమనార్హం.
