Mosquito Bite: సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.
సాధారణంగా రక్తం దొరకనప్పుడు దోమలు మొక్కల్లోని చెక్కరను ఆహారంగా తీసుకుంటాయి. పండ్లు, పువ్వులను వచ్చే సువాసలకు సాధారణంగా మనుషులు ఆకర్షితం అవుతుంటారు. అయితే ఇదే విధంగా మనుషులు వాడే సబ్బుల నుంచి వచ్చే సువాసనలు కూడా దోమల్ని ఎక్కువగా ఆకర్షించడాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుందని వర్జీనియాలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ టెక్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఐసైన్స్ జర్నల్ లో ప్రచురించారు.
Read Also: Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ ఆదేశాలు..
ఈ రిసెర్చ్ కు నాయకత్వం వహిస్తున్న పరిశోధకుడు క్లెమెంట్ వినాగర్ మాట్లాడుతూ.. సబ్బుల నుంచి వచ్చే సువాసనలు, దోమల్ని ఆకర్షించవచ్చని వెల్లడించారు. నలుగురు వాలంటీర్ల సహాయంతో సబ్బులు, దోమలకు ఉన్న ఆకర్షణ బంధంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మొదటగా వారు ప్రతీ వ్యక్తి నుంచి వచ్చే వాసనను అధ్యయనం చేసి, వారిని ఒకసారి సబ్బులు వినియోగించకుండా, మరోసారి మూడు రకాల సబ్బులను ఉపయోగించేలా చేసి ప్రయోగం నిర్వహిచారు. సబ్బులను వాడిన తర్వాత 60 శాతం ఎక్కువగా వారి శరీరం నుంచి వచ్చే వాసన కాకుండా సబ్బు వాసన వస్తున్నట్లు కనుగొన్నారు.
మన శరీరవాసనకు సబ్బు వాసనను జోడించడమే కాకుండా.. కొన్ని రసాయనాలను కూడా శరీరానికి అంటిస్తున్నాయని తేలిందని క్లెమెంట్ వినాగర్ చెప్పారు. సహజ రసాయనాలు, సబ్బు రసాయనాల మధ్య పరస్పర చర్య ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా దోమలు పోషకాలను కనుగొనేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను ఉపయోగిస్తాయి. వాసనల మధ్య పరస్పర చర్యలను పరీక్షించడానికి, పరిశోధకులు దోమలను మెష్ లో విడుదల చేశారు. నలుగురితో పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో విచిత్రంగా సబ్బులు వాడిన ముగ్గురు వ్యక్తులు దోమల్ని ఎక్కువగా ఆకర్షించగా.. ఒకరిని మాత్రం పెద్దగా దోమలు ఆకర్షించలేదు. ముఖ్యంగా పువ్వులు, పండ్ల నుంచి వచ్చే వాసనలు కలిగిన సబ్బులు దోమల్ని ఎక్కువగా ఆకర్షించగా.. కొబ్బరి సువాసన కలిగిన సబ్బు దోమల్ని పెద్దగా ఆకర్షించలేదు.