పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్ది రోజులు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై అనేక రకమైన పుకార్లు నడిచాయి. జైల్లో హత్యకు గురయ్యారంటూ వదంతలు వ్యాప్తించాయి. అనంతరం ఇమ్రాన్ ఖాన్ సోదరి చూసి రావడంతో అనుమానాలకు నివృత్తి జరిగింది.
ఇంతలోనే అవినీతి కేసులో శనివారం 17 ఏళ్ల జైలు శిక్ష పడినట్లుగా పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు పాకిస్థాన్ కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నుంచి జైల్లోనే ఉంటున్న ఆయనకు తాజా తీర్పు మరో పిడుగు పడినట్లైంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను హెపటైటిస్‌తో బాధపడుతున్న రోగులతో ఉంచినట్లుగా బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా జైలు అధికారులు మానసికంగా వేధిస్తున్నారని సోదరీమణులు ఆరోపించారు.
