US Iran Conflict: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అగ్ర రాజ్యం అమెరికా ప్రవేశించింది. ఈ సందర్భంగా శనివారం రాత్రి టెహ్రాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది యూఎస్. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడిపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హాయర్ పేరుతో ఎటాక్ చేశాం అన్నారు. టెహ్రాన్ పై ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్ సేత్ వెల్లడించారు.
Read Also: udivada Amarnath: చంద్రబాబు పబ్లిసిటీ కోసమే యోగాంధ్ర.. ఇది ఎవరికీ ఉపయోగపడలేదు..!
అయితే, ఇరాన్ ప్రతికార దాడులకు దిగితే, మేం గట్టిగా జవాబిస్తాం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ పేర్కొన్నారు. ఇక, మేము టెహ్రాన్ సైన్యాన్ని, ప్రజలను టార్గెట్ చేయలేదు.. ఓన్లీ అణు స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని తెలిపారు. మిస్సౌరి నుంచి బీ-2 బాంబర్లు బయల్దేరి.. ఇరాన్ అణు స్థావరాలపై 14 బంకర్ బస్టర్లను ప్రయోగించాం అన్నారు. అలాగే, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం మా ఉద్ధేశం కాదు అని మరోసారి చెప్పారు. గత 10 ఏళ్లుగా అణుబాంబులను తయారు చేయొద్దని చెబుతూనే ఉన్నాం.. ఈ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చాలా మంది ప్రెసిడెంట్లు ప్రయత్నించారు.. కానీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే సక్సెస్ అయ్యారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్ తెలిపారు.