NTV Telugu Site icon

Israel-Iran: ఇజ్రాయెల్కు మరింత సైనిక సామగ్రిని అందిస్తున్న అమెరికా..

Iran

Iran

Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ కు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పెంటగాన్‌ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ పాట్‌ రైడర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌.. దాని మద్దతుదారులు అమెరికన్ పౌరులను, సిబ్బందిని టార్గెట్ చేస్తే.. వారిని రక్షించేందుకు మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించబోతున్నట్లు తెలిపారు.

Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు.. అది రద్దు.. రిషికొండ చేరిక..

ఇక, తాజాగా తరలిస్తున్న సైనిక సామగ్రిలో దీర్ఘశ్రేణి బీ-52 బాంబర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్‌ క్షిపణులను ధ్వసం చేసే మిషన్లు ఉంటాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా, ఇటీవల టెర్మినల్‌ ‘హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ బ్యాటరీ (THAAD)’తో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే మరిన్ని ఆయుధాలు పంపేందుకు రెడీ అవడం గమనార్హం.
అయితే, అక్టోబరు 1వ తేదీన టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్‌ దాడి చేసింది.

Read Also: Bhadradri: భద్రాద్రికి కార్తీక శోభ.. శివాలయంలో నేటి పూజలు..

అయితే, ఈ దాడులకి ప్రతీకారంగా ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన నలుగురు సైనికులు చనిపోగా.. క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ ప్రతికార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయొద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచలను జారీ చేశాయి. ఈ క్రమంలోనే యూఎస్ మరింత ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ కు అందించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.

Show comments