Site icon NTV Telugu

Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్‌, వాల్‌మార్ట్‌.. భారత్ స్టాక్ నిలిపివేత!

Trump Tariffs Effect

Trump Tariffs Effect

భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల వరకు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తొలుత 25 శాతం టారిఫ్ పెంచగా.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకాన్ని ట్రంప్ పెంచారు. దీంతో పలు రంగాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి.

ఇది కూడా చదవండి: Gaza-Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. గాజా స్వాధీనానికి కేబినెట్ పచ్చజెండా

తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ దగ్గజ వ్యాపార కంపెనీలు అమెజాన్, వాల్‌మార్ట్.. భారత్ స్టాక్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారతదేశం నుంచి వచ్చే ఆర్డర్‌లను నిలిపివేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. తదుపరి సమాచారం వచ్చేంత వరకు దుస్తులు, వివిధ సరుకులను నిలిపివేయాలని భారత టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్‌  వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Trump-Putin: జెలెన్‌స్కీతో ఎలాంటి చర్చలుండవు.. ట్రంప్-పుతిన్ భేటీ ఉంటుందన్న రష్యా దౌత్యవేత్త

ట్రంప్ విధించిన టారిఫ్‌ను కొనుగోలుదారులు భరించడానికి ఇష్టపడడం లేదు. ఇక ఎగుమతిదారులైనా ఖర్చులు భరిస్తారా? అని చూస్తే వారు కూడా అందుకు అంగీకారంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో భారత్ స్టా్క్‌లు నిలిపివేయాలని అమెజాన్, వాల్‌మార్ట్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధిక సుంకాల కారణంగా ఖర్చులు 30 శాతం నుంచి 35 శాతం వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. దీని వలన అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 శాతం నుంచి 50 శాతం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీని వలన దాదాపు 4-5 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Huma Qureshi: ఢిల్లీలో పార్కింగ్ వివాదం.. హీరోయిన్ హుమా ఖురేషి బంధువు హత్య

భారత్‌లో వెల్‌స్పన్‌ లివింగ్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండోకౌంట్‌, ట్రైడెంట్‌ వంటి ప్రధాన టెక్స్‌టైల్‌ ఎగుమతిదారు సంస్థలు తమ విక్రయాల్లో 40-70శాతం అమెరికాకే పంపిస్తున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో తమకు అగ్రరాజ్యం నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటివరకు భారతీయ దుస్తులు, ఫ్యాషన్‌ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఈ రంగంలో 36.61 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు వెళ్లగా.. ఇందులో 28 శాతం అమెరికాకే చేరాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలపై 20శాతం టారిఫ్‌లు ఉన్నందున.. అమెరికా సంస్థలు టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయాలు ఆలోచించే అవకాశం ఉంది.

రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నందున భారత్‌పై ట్రంప్‌ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించిన ఆయన.. ఇటీవల దాన్ని 50శాతానికి పెంచారు. గతంలో ప్రకటించిన 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా.. అదనపు సుంకాలు ఈనెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ టారిఫ్‌లతో వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడనుంది.

Exit mobile version