India: భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం ముదురుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఎజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. ఇదే కాకుండా భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి బదులుగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఢిల్లీలో…