Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Airindia Passenger Attack On Flight Attendant

Latest Crime News: విమానంలో ఆ మద్యం వద్దన్నందుకు అటెండర్‌ను రక్తం కారేలా కొట్టిన ప్రయాణికుడు

Published Date :July 12, 2022 , 3:19 pm
By Akkirala Kondala Rao
Latest Crime News: విమానంలో ఆ మద్యం వద్దన్నందుకు అటెండర్‌ను రక్తం కారేలా కొట్టిన ప్రయాణికుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్‌ సర్వీస్‌ అందుబాటులో ఉంది. కాకపోతే సిబ్బంది ఇచ్చిన మద్యం మాత్రమే తాగాలి. అఫ్‌కోర్స్‌ దానికి డబ్బులు కట్టాలనుకోండి. అది వేరే విషయం. విమానంలో మనం తీసుకెళ్లిన మందు తాగుతానంటే నిబంధనలు ఒప్పుకోవు. సేఫ్టీ, సెక్యూరిటీ రీత్యా బయటి మద్యాన్ని అనుమతించట్లేదు. కానీ.. రూల్స్‌ పాటిస్తే వాళ్లు మందుబాబులు అని ఎందుకు అనిపించుకుంటారు. లేటెస్టుగా ఢిల్లీ నుంచి లండన్‌కి వెళుతున్న ఓ విమానంలో ఇదే జరిగింది. వెంట తెచ్చుకున్న జిన్‌ బాటిల్‌లోని డ్రింగ్‌ని తాగేందుకు ప్రయత్నించిన ప్రయాణికుణ్ని ప్లైట్‌ అటెండర్‌ అడ్డుకోవటం తీవ్ర ఘర్షణకు దారితీసింది.

అడ్డుచెప్పిన స్టీవార్డ్‌ని ప్యాసింజర్‌ విపరీతంగా కొట్టాడు. చెవులు, ముక్క నుంచి రక్తం కారేలా చితకబాదాడు. విమానం గమ్యానికి చేరుకున్న తర్వాత నిందితుణ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితుణ్ని ఆస్పత్రిలో చేర్పించి కోలుకున్నాక ఇంటికి పంపించారు. ఈ ఘటన ఈ నెల 7వ తేదీన జరిగింది. కొంత మంది ప్రయాణికులు ఓ బృందంగా ఏర్పడి ఎయిరిండియా విమానం ఎక్కారు. అదే ఫ్లైట్‌లో ముంబైకి చెందిన ఓ అటెండర్‌ కూడా ఉన్నాడు. ప్యాసింజర్ల గ్రూపు మార్గమధ్యంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఆ ప్రయాణికుడు తన లగేజీలోని బాటిల్‌ని బయటికి తీసి గ్లాసులో మద్యం పోసుకుంటున్నాడు.

ఇది గమనించిన అటెండర్‌ అలా చేయొద్దని, తాము ఇచ్చిన సీసాల్లోని మందునే తాగాలని మర్యాదపూర్వకంగా చెప్పాడు. దీంతో మద్యంమత్తులో ఉన్న ప్యాసింజర్‌కి మండింది. దిగ్గున లేచి ఆ సహాయకుణ్ని గల్లా పట్టుకొని డోర్‌కి ఆనించి విచక్షణారహితంగా కొట్టాడు. ఆరేడు సార్లు గట్టిగా చెయ్యి చేసుకున్నాడు. ఛాతీ మీద కూడా బాదాడు. దీంతో అటెండర్‌కి చెవులు, ముక్కు నుంచి రక్తం కారింది. అంతకుముందు.. అదే ప్రయాణికుణ్ని, అతని గ్రూపు సభ్యులను ముఖానికి మాస్కులు పెట్టుకోవాలని విమాన సిబ్బంది పదే పదే రిక్వెస్ట్‌ చేసినా పట్టించుకోలేదని తోటి ప్రయాణికులు చెప్పారు. దాడి విషయాన్ని ఎయిరిండియా అధికార ప్రతినిధి కూడా నిర్ధారించారు. కానీ వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AirIndia
  • attack attendant
  • Crime News
  • Delhi
  • Drinking Alcohol

తాజావార్తలు

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions