NTV Telugu Site icon

Russia: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా సంచలన ప్రకటన

Russia

Russia

హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చడంతో మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. చివరికి హిజ్బుల్లా అగ్ర నేతలను అంతమొందించింది. అతి ముఖ్యమైన కమాండర్లను లేపేసింది. ఇక హిజ్బుల్లాలో అత్యంత శక్తివంతమైన నేత, దాని అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్‌ తుదిముట్టించడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. అత్యంత రహస్య ప్రాంతాల్లో దాగి ఉన్న నస్రల్లాను తుదిముట్టించడం హిజ్బుల్లా మద్దతుదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇది కూడా చదవండి: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్..!

ఇక ఇదే అంశంపై రష్యా కీలక ప్రకటన చేసింది. నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా అభివర్ణించింది. తక్షణమే లెబనాన్‌పై దాడులు ఆపాలని సూచించింది. ఇక ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయల్ మిషుస్తిన్ పర్యటిస్తున్నారని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడితో కూడా భేటీ కానున్నారని వెల్లడించింది. ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో కూడా రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ ఇరాన్ సాయం ఎప్పటికీ మరిచిపోనిది అని తెలిపింది. ఇరాన్‌తో మైత్రి పెంపొందించుకుంటామని.. అలాగే వ్యాపార సంబంధాలు కూడా బలపరుచుకుంటామని రష్యా స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..

నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌లో భీకర దాడులు చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులను కూల్చివేస్తోంది. నివాస సముదాయాల్లోనే హిజ్బుల్లా ఆయుధాలను దాచి పెట్టినట్లుగా ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బీరుట్ నగరంలోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే లెబనాన్ పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని సూచించింది. తమ లక్ష్యం పూర్తయ్యాక తిరిగి పౌరులు రావొచ్చని వెల్లడించింది. ఇక ఇరాన్ కాలుదువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు