Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తాలిబన్‌లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా సామాన్య ప్రజలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. శాంతి మంత్రం వల్లెవేస్తూనే, అరాచకాలు సృష్టిస్తున్నారు. మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే విదేశీ మీడియా సంస్థలు, ప్రతినిధులు, జర్నలిస్టులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఉన్న మీడియా క్షణక్షణం భయం భయంగా వార్తలను అందిస్తోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ వారి అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, స్థానిక…