ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించకూడదు: ధోవల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను కూడా న్యూఢిల్లీ ఆహ్వానించింది, అయితే రెండు దేశాలు ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు.
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు “ఆశ్రయం, శిక్షణ, ప్రణాళిక లేదా ఆర్థిక సహాయం” కోసం ఉపయోగించరాదని ఈ డిక్లరేష న్‌లో స్పష్టంగా పేర్కొంది. కుందుజ్, కాందహార్, కాబూల్‌లలో ఇటీవ ల జరిగిన ఉగ్రవాద దాడులను కూడా ఇది ఖండిస్తుందని ధోవల్ తెలిపారు. పాకిస్తాన్ పేరు పెట్టకుండానే, మొత్తం ఎనిమిది దేశాలు ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని మద్దతిస్తున్నాయని ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ఈ ఏడాది ఆగస్టులో తాలిబాన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజలు పడుతున్న బాధలపై ఈ ఎనిమిది దేశాలు కూడా “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశాయి. ఈ ప్రాంతంలో “రాడికలైజేషన్, తీవ్రవాదం, వేర్పాటు వాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముప్పుకు సంబం ధించి వ్యతిరేకంగా సామూహిక సహకారం” కోసం ఈ డిక్లరేషన్ పిలుపు నిచ్చింది. భారతదేశం, ఇరాన్, రష్యా, ఐదు మధ్య ఆసియా దేశాలు కూడా ఆఫ్ఘన్ ప్రజలందరి ఇష్టానుసారం ప్రాతినిథ్యం వహించే ప్రభు త్వాన్ని” ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఈ డిక్లరేషన్ నొక్కి చెప్పింది.
- Tags
- afganisthan
- Delhi
- Dhoval
- Iran
- Kazakhstan
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!