Site icon NTV Telugu

Viral: గాల్లో విమానం… చక్కెర్లు కొట్టిన గుర్రం.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్..

Untitled 17

Untitled 17

Viral: సాధారణంగా మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి జంతువులను రవాణా చేస్తుంటాము. అందుకు వీలైతే రోడ్డు మార్గాన్ని, లేకుంటే సముద్ర మార్గాన్ని, కొన్ని సందర్భాలలో వాయు మార్గాన్ని కూడా వినియోస్తుంటాం. అయితే రోడ్డు, నీటి మార్గంలో జంతువులను రవాణా చేయడం కొంచం సువుగానే ఉంటుంది. కానీ విమానంలో జంతువులను రవాణా చేసే సందర్భం లో చిన్న తేడా జరిగిన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలా విమానంలో బోనుల్లో ఉంచిన జంతువులు బోను నుండి బయటకు వచ్చి కలకలం సృష్టించ్చిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఈ ఘటన ఎయిర్‌ అట్లాంటా ఐస్‌లాండిక్‌ కు చెందిన బోయింగ్‌ విమానంలో చోటుచేసుకుంది.

Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..

వివరాలలోకి వెళ్తే.. ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే నుంచి బెల్జియం కు బోయింగ్‌ 747 విమానం బయలుదేరింది. కాగా దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేసేందుకు విమానంలో ఓ బోనులో ఉంచారు.అయితే విమానం టేకాఫ్‌ అయిన 30 నిమిషాల తర్వాత బోను నుంచి గుర్రం తప్పించుకుని బయటకు వచ్చింది. యథేచ్ఛగా విమానం లోపలే అటు ఇటు తిరగడం మొదలు పెట్టింది. దీనితో ఒక్కసారిగా విమానంలో ప్రయాణికులతో పాటుగా సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో సిబ్బంది హుటాహుటీన గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు.

Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..

ఈ నేపథ్యంలో సంస్థ మాట్లాడుతూ.. గుర్రం బోను నుండి బయటకు రావడం వల్ల టెన్షన్ పడ్డామని.. విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్‌ సముద్రంలో డంప్‌ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అలానే గుర్రం కారణంగా న్యూయార్క్ లో అత్యవసరంగా విమానం ల్యాండ్ చేశామని.. అనంతరం విమానాశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారని . ఈ క్రమంలోనే గుర్రానికి గాయాలైయ్యాయని తెలిపారు. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.

Exit mobile version