మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. మాలేలో విదేశీ కార్మికులు నివాసం ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగి.. అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి.. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు ఉండడం కలచివేస్తోంది… తొమ్మిది మంది భారతీయులు, ఒకరు బంగ్లాదేశ్ జాతీయుడిగా గుర్తించారు మల్దీవుల అధికారులు.. ఇక, మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది..
Read Also: Ganja Biscuits: గంజాయి బిస్కెట్ల కలకలం.. జైలులో ఉన్న అన్నకు పంపి జైలుపాలైన తమ్ముడు..
మాల్దీవుల్లో దేశ రాజధాని మాలేలో విదేశీ కార్మికుల నివాసం ఉంటే ఇరుకైన భవనంలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.. మొత్తం 11 మంది మరణించారు మరియు పలువురు గాయపడినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఉన్నారని భద్రతా అధికారి తెలిపారు. మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేస్తూ, ట్వీట్ చేసింది.. “మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో భారతీయ పౌరులు సహా ప్రాణనష్టం జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం.. మేం వారి కుటుంబసభ్యులు, సన్నిహితులతో కమ్యూనికేషన్‌లో ఉన్నామని మాల్దీవుల అధికారులు తెలిపారు..
గ్రౌండ్ ఫ్లోర్ వెహికల్ రిపేర్ గ్యారేజీ నుంచి వచ్చిన మంటలు.. మొత్తం భవానికి వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది.. భవనం పై అంతస్తు నుంచి 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. “మేం 10 మృతదేహాలను కనుగొన్నాము,” అని అగ్నిమాపక సేవ అధికారి తెలిపారు, మంటలను ఆర్పడానికి తమకు నాలుగు గంటల సమయం పట్టిందని తెలిపారు. విదేశీ కార్మికుల పరిస్థితిని మాల్దీవుల రాజకీయ పార్టీలు విమర్శించాయి. మల్దీవుల జనాభాలో దాదాపు సగం మంది విదేశీయులే ఉన్నారు.. ఎక్కువగా బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంకకు చెందినవారే ఉంటారు..