అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లూయిస్‌విల్లే విమానాశ్రయం సమీపంలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. విమానం కూలిపోగానే మంటలు పెద్ద ఎత్తున విస్తరించాయి.
Russia: టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది. మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది. 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం.