Site icon NTV Telugu

Las Vegas shooting: అమెరికాలో కాల్పులు.. లాస్ వెగాస్‌లో ఐదుగురు మృతి..

Usa

Usa

Las Vegas shooting: అమెరికా మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లో కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు. దుండగుడు కాల్పుల అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్ అధికారులు ఎదురుపడటంతో నిందితుడు ఎరిక్ ఆడమ్స్(57) మంగళవారం ఉదయం తనని తాను కాల్చుకున్నాడు. వేర్పేరు అపార్ట్మెంట్లలో సోమవారం కాల్పులు జరిపి నిందితుడు పారిపోయాడు. అప్పటి నుంచి అతని కోసం వెతుకుతున్నారు.

Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

మంగళవారం ఉదయం స్థానిక మార్కెట్‌లో ఆడమ్స్ ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ సమయంలో ఆడమ్స్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న నిందితుడు సోమవారం రాత్రి అదే అపార్ట్మెంట్‌లోని నలుగురు మహిళలు, 13 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపి చంపేశాడు.

Exit mobile version