Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan Earthquake: జపాన్ దక్షిణ ప్రాంతంలోని కగోషిమా ప్రాంతంలో బుధవారం (మే 20) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా పలు భవనాలు ఒక్కసారిగా కంపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంప ప్రభావం ఒకినావా ప్రధాన ద్వీపం సమీప ప్రాంతాల్లో కూడా తీవ్రంగా అనిపించింది.
అయితే భూకంపం అనంతరం అధికారులు ప్రజలకు కొంత ఊరటనిచ్చారు. ప్రస్తుతం సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఏదీ లేదని వెల్లడించారు. అయినప్పటికీ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. భౌగోళికంగా జపాన్ ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇటీవల కూడా జపాన్‌లో వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. కాగోషిమా భూకంపానికి నాలుగు రోజుల ముందు, జపాన్ ప్రధాన ద్వీపమైన హోన్షు తూర్పు తీర ప్రాంతంలో మరో బలమైన భూకంపం సంభవించింది. ఆ సమయంలో తోహూకు ప్రాంతంలో అత్యవసర హెచ్చరికలు జారీ చేయగా, కొన్ని గంటల పాటు రైలు సేవలను కూడా నిలిపివేశారు. అయితే ఆ ఘటనలో కూడా ఎలాంటి భారీ నష్టం జరగలేదు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!