Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Mileage Car: అమెరికాలోని బ్రిఘమ్ యంగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ఓ ప్రత్యేక వాహనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ ఇంధన ఇంజిన్‌తో పనిచేసే ఈ అల్ట్రా ఎఫిషియంట్ వాహనం లీటర్‌కు ఏకంగా 911 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని వెల్లడించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఇంధన పొదుపుపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
“సూపర్మైలేజ్” పేరుతో రూపొందించిన ఈ వాహనం ప్రధానంగా గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి తయారు చేశారు. ఇది రోజువారీ ప్రయాణాల కోసం కాకుండా ప్రత్యేక పోటీల కోసం రూపొందించిన ప్రయోగాత్మక వాహనం. షెల్ ఎకో-మారథాన్ పోటీల కోసం దీన్ని అభివృద్ధి చేశారు. ఈ వాహనం రూపకల్పన చూస్తే చిన్న కార్, త్రిచక్ర వాహనం కలయికలా కనిపిస్తుంది. కార్బన్ ఫైబర్‌తో తయారు చేసిన తేలికపాటి బాడీ, అత్యంత తక్కువ ఎత్తు దీని ప్రత్యేకతలు. డ్రైవర్‌కు సరిపడే స్థలం కూడా చాలా పరిమితంగా ఉండటంతో, సుమారు 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 54 కిలోల బరువు వరకు ఉన్నవారే ఇందులో కూర్చోగలరు. వాహనం మొత్తం బరువు కేవలం 49 కిలోలు మాత్రమే ఉండటం దీని అధిక మైలేజ్‌కు ప్రధాన కారణంగా తెలుస్తుంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
షెల్ ఎకో-మారథాన్ నిబంధనల ప్రకారం ఈ వాహనం ఇండియన్ అపోలిస్ మోటార్ స్పీడ్ వే ట్రాక్‌పై 16 కి.మీ. ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సాధారణ ఫ్యూయల్ ట్యాంక్‌కు బదులుగా ఇందులో కేవలం 30 మిల్లీలీటర్ల ఇథనాల్ నిల్వ వ్యవస్థను ఉపయోగించారు. ఈ చిన్న ఇంధన పరిమాణంతోనే వాహనం 2,145 మైళ్ల పర్ గ్యాలన్ మైలేజ్ సాధించిందని పరీక్షల్లో వెల్లడైంది. భారతీయ ప్రమాణాల ప్రకారం ఇది సుమారు లీటర్‌కు 911 కిలోమీటర్లకు సమానం.
అయితే ఈ వాహనం స్పీడ్ పరంగా మాత్రం పరిమితంగానే ఉంటుంది. గరిష్టంగా గంటకు 37 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. అంతేకాకుండా గాలి దిశ, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలు వాస్తవ పరిస్థితుల్లో దీని పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ “సూపర్మైలేజ్” ప్రోటోటైప్ ద్వారా తక్కువ బరువు, అత్యుత్తమ ఏరోడైనమిక్ డిజైన్, సమర్థవంతమైన ఇంజినీరింగ్ ఉంటే సంప్రదాయ ఇంధన ఇంజిన్లతో కూడా అద్భుతమైన ఇంధన సామర్థ్యం సాధించవచ్చని విద్యార్థులు నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఈ ఆవిష్కరణ ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!