China: చైనాలో అమానుష ఘటన.. కార్ ఢీకొట్టి 35 మంది మృతి..
- చైనాలో దారుణ ఘటన..
- పాదచారులపైక కార్ దూసుకెళ్లడంతో 35 మంది మృతి..
China: చైనాలో దారుణ ఘటన జరిగింది. అమాయమైన ప్రజలపైకి కారుని పోనిచ్చి 35 మంది ప్రాణాలు తీశాడు. దక్షిణ చైనాలోని జూహై నగరంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం జరిగిన ఘటనలో, పోలీసులు ముందుగా ప్రజలు గాయపడ్డారని నివేదించారు. అయితే, ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో మంగళవారం మరణించిన వారి సంఖ్యను వెల్లడించారు.
Read Also: Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉండి ఇవి తిన్నారో.. ఇక దబిడి దిబిడే
Also Read
జూహై స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన దుర్మార్గపు దాడిలో మరణించిన వారి సంఖ్య 35 అని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి 62 ఏళ్ల వ్యక్తి పాల్పడ్డాడు. అతడి ఇంటిపేరును ఫ్యాన్‌గా గుర్తించారు. గేటు బయట నుంచి చిన్న ఎస్యూవీ కార్ని నగరంలోని స్పోర్ట్ సెంటర్లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్న వ్యక్తులపైకి పోనిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు తన గొంతు కోసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడి మెడ, ఇతర శరీర భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో కోమాలో ఉన్నాడు, విచారించేందుకు సాధ్యపడలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ స్పందించారు. గాయపడిన వారికి అన్ని విధాల చికిత్స అందించాలని ఆదేశించాడరు. నేరస్తుడిని చట్టప్రకారం శిక్షించాలని కోరినట్లు అధికారిక జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!