Bus Falls into River: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే వెంబడి బస్సు నదిలోకి పడిపోవడంతో ఆదివారం సాయంత్రం కనీసం 24 మంది మరణించారని స్థానిక మీడియా నివేదించింది. సెంట్రల్ కెన్యాలో బస్సు వంతెనపై నుండి నదీ లోయలోకి పడిపోయింది. కౌంటీ నుండి నైరోబీకి వెళుతున్న బస్సు వంతెనపై నుండి 40 మీటర్ల దిగువన ఉన్న నదీ లోయలోకి పడిపోయిందని.. కనీసం 24 మంది మరణించినట్లు మీడియా సోమవారం నివేదించింది.
Business Headlines: భూటాన్ టూర్ భారమే. మనోళ్లకి కాస్త నయం. వేరే దేశాలకు మరీ..
20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరి గల్లంతైనట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్యూర్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది.పెద్ద సంఖ్యలో ప్రమాదాలు సంభవించినందున వంతెనను “బ్లాక్ స్పాట్”గా గుర్తించినట్లు రాజధాని న్యూస్ తెలిపింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2021లో కెన్యాలో రోడ్డు ప్రమాదాల్లో 4,579 మంది మరణించారు, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15శాతం పెరిగింది.