Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
- ఘోర విమాన ప్రమాదం
- 10 మంది దుర్మరణం
- బహమాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bahamas Plane Crash: బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బహమాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించడంతో ఆనందోత్సవాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారాయి.
ఫ్లెమింగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన సెస్నా 402 విమానం
ప్రమాదానికి గురైన విమానం ఫ్లెమింగో ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న సెస్నా 402. ఈ విమానం నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్కు బయలుదేరింది. అయితే ప్రయాణం మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
- Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
- JD Vance: వైట్ హౌస్‌లో అంతర్గత పోరు.. రిపబ్లికన్ పార్టీ ఓటమిపై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు..
ల్యాండింగ్ అనంతరం మంటలు.. భారీ పేలుడు
అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం భారీ పేలుడు సంభవించడంతో విమానంలో ఉన్న వారంతా మృతి చెందినట్లు వెల్లడించారు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఒక వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీసినప్పటికీ చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు.
బ్లాక్ బాక్స్ స్వాధీనం.. దర్యాప్తు ప్రారంభం
ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు విమానం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దాని విశ్లేషణ అనంతరం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
ఈ ఘటన అనంతరం ఫ్లెమింగో ఎయిర్‌లైన్స్ తమ అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సంస్థ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఆదేశించింది.
ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ సంతాపం
ప్రమాదంపై బహమాస్ ప్రధానమంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక వేడుకలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం అందించిన అనంతరం వారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని బహమాస్ ప్రభుత్వం తెలిపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తైన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!