Shark Attack: పెళ్లైన తర్వాతి రోజు మృత్యువు షార్క్ రూపంలో వచ్చింది. నవ వధువుపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బహామాస్‌లో జరిగింది. తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పాడిల్ బోర్డింగ్ చేస్తుండగా, షార్క్ అటాక్ చేసింది. బోస్టన్‌కి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఆదివారమే వివాహం జరిగిందని, సోమవారం బీచ్‌లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా, ఈ భయంకరమైన దాడి జరిగింది.