ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.
READ MORE: Harish Rao: బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో గోదావరి నీళ్లను ఏపీ దోపిడి చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా..?
సొంతిల్లు కట్టుకోవాలని కల కనేవారికి బ్యాంకులు శుభ వార్త చెప్పాయి. దేశంలోని అనేక బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును తగ్గించడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా జూలైలో తమ ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) రేట్లను 5 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 2025 నుంచి రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎంసీఎల్‌ఆర్(MCLR) అనేది బ్యాంకు రుణం ఇవ్వగల అత్యల్ప వడ్డీ రేటును సూచిస్తుంది. కాగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ వడ్డీ రేట్లను 7.45 శాతానికి తగ్గించింది.
READ MORE: MLA Kaushik Reddy: పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడొద్దు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని కాలపరిమితి రుణాలపై ఈ ఎంసీఎల్‌ఆర్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తగ్గింపు వివరాలు ఈ కింది పట్టికలో చెక్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎమ్‌సీఎల్‌ఆర్ రేట్లను అన్ని కాలపరిమితికి 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తాయి.
ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు..
ఇండియన్ బ్యాంక్ అన్ని కాలపరిమితులకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించింది. కొత్త రేట్లు జూలై 3, 2025 నుండి వర్తిస్తాయి.
