ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.