Surya Grahanam: హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం వేర్వేరు నెలల్లో వస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే, హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ క్రమంలో, ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం రేపు (సెప్టెంబర్ 21న) రాబోతుంది. కాగా, ఈ గ్రహణం ఎఫెక్ట్ భారత్‌లో ఉండదని సమాచారం. అందువల్ల మన దేశంలో సూతక కాలం వర్తించదు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడంతో సూర్యకాంతి కొంతమేర తగ్గుతుంది.
Read Also: Flood Tragedy: రాయచోటిలో వరదలో కొట్టుకుపోయిన ఆటో.. నలుగురు మృతి!
అయితే, ఈ సూర్యగ్రహణం రేపు (సెప్టెంబర్ 21న) రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఉంటుంది. ఇది ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం. ఇక, 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది అని చెప్పాలి. ఆ తర్వాత 2114వ ఏడాదిలో ఇలాంటి గ్రహణం సంభవించే ఛాన్స్ ఉంది. కాగా, రేపు ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు కళ్లకు హానికరం.. కాబట్టి ఈ గ్రహణాన్ని నేరుగా చూడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా ఆఫ్టికల్ పరికరాల సాయంతో చూడాలంటున్నారు.
Read Also: Jagtial: కూలీలుగా మారిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు..
ఇక, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిదని జ్యోతిష్ట పండితులు తెలియజేస్తున్నారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం స్టార్ట్ అవుతుంది. కానీ, ఇది గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రమే.. కాబట్టి భారత్‌లో ఈ గ్రహణం కనిపించకపోవడంతో సూతక కాలం కూడా వర్తించదు.. అయితే, ఈ సూర్యగ్రహణం ప్రభావం ముఖ్యంగా నాలుగు రాశులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మిథునం, కన్యారాశి, ధనుస్సు రాశి, మీనా రాశులపై దీని ఎఫెక్ట్ ఉండనుంది.
Read Also: Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ లియోనీ..
కన్యారాశి
కన్యారాశి వారు సూర్యగ్రహణం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. కన్యా రాశి వారు ఆర్థికపరమైన విషయాలలోనూ కొద్దీగా అప్రమత్తంగా ఉండే మంచిది. అలాగే, ఆరోగ్య పరంగాను వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఈ గ్రహణ సమయంలో చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అస్సలు తొందరపడకుండా జాగ్రత్త పడాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి సూర్యగ్రహణం వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ పని చేసిన అడ్డంకులు వస్తాయి.. డబ్బుల విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది.. అలాగే, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బలహీనంగా పడే ప్రమాదం ఉంది. కాబట్టి మిథునరాశి వారు గ్రహణం రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారు సూర్యగ్రహణంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి.. చేసే పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టాలను చవిచూస్తారు. ఈ గ్రహణ సమయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహణం ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే ఇది వీరికి చాలా కష్టాలను తెచ్చే అవకాశం ఉంటుంది.
మీనరాశి
మీనరాశి వారు సూర్యగ్రహణం వల్ల అనేక ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీన రాశి వారికి ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలే లభిస్తాయి. ఆర్థికపరంగా పలు సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. పోలీస్ కేసుల్లో చిక్కుకుంటారు.. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
* ఈ వార్త వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనికి ఎన్టీవీ తెలుగు. కామ్ కి ఎలాంటి సంబంధం లేదు..