సినిమాల్లో గ్లామర్ రోల్స్, ప్రత్యేక పాటలతో ఎప్పుడూ కుర్రకారుని అలరించే సన్నీ లియోనీ ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈసారి ఆమె నటిగా కాదు, నిర్మాతగా కొత్త పాత్రలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించనుంది సన్నీ.
Also Read : Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ..
తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేసింది. “ఈ వెబ్‌సిరీస్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. నేను స్క్రిప్ట్ విన్న వెంటనే ఇది స్ఫూర్తినిచ్చే కథ అని భావించాను. ఇలాంటి ప్రాజెక్ట్‌తో నిర్మాతగా నా కొత్త ప్రయాణం మొదలు కావడం చాలా ఆనందంగా ఉంది” అని సన్నీ పేర్కొంది. ఇక ఈ సిరీస్‌ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించనున్నారని సమాచారం. గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించేలా, కంటెంట్‌కి వాస్తవికతతో పాటు ఎమోషనల్ టచ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. సన్నీ కూడా వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక తో పాటు మరిన్ని కీలక వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే సన్నీ నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీలో, ఆమె అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. నిర్మాతగా ఆమె మొదటి ప్రాజెక్ట్ ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.