సెప్టెంబర్ 17, శుక్రవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. క్రయ, విక్రయాలు సామాన్యం. ఆప్తుల ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. వాహనం నిదానంగా నడపడం మంచిది. ఉద్యోగయత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
వృషభం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
Also Read
మిథునం : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుటవల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, తరచూ పర్యటనలు అధికం. మహిళా ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, తోటివారితో చికాకులు తప్పవు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.
కర్కాటకం : వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారంవుంది. ధనవ్యయంలో మితం పాటించండి. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన అవసరం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి.
సింహం : గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందడంతో పాటు గృహరుణం మంజూరవుతుంది. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. లాయర్ నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం భంగం, వైద్య పరీక్షలు తప్పవు. మీ వైపు నుంచి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా మెళకువ వహించండి.
కన్య : స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వైద్య రంగాల వారికి కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఆత్మీయుల ప్రశంసలు పొందుతారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనలా ఫలించగలవు. ఆస్తి వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ప్రయాణాలు అనుకూలం.
తుల : గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. మతిమరుపు కారణంగా ఇబ్బందులెదుర్కొంటారు. పాత మిత్రులు, ఆత్మీయులను కలుసుకుంటారు.
వృశ్చికం : వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యపారాలు ఊపందుకుంటాయి. ఏజెంట్లు బ్రోకర్ల శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం పొందుతారు. ప్రేమికుల తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే.
ధనస్సు : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. ధనం ముందుగానే సిద్ధం చేసుకోవడానికి యత్నించండి. పారిశ్రామిక, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఫ్లీడర్లకు చికాకులు అధికమవుతాయి.
మకరం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు సంతృప్తి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు గుర్తింపు ఆమోదం లభిస్తాయి.
కుంభం : రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చింతించక తప్పదు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది.
మీనం : ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినియ్యవు. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మార్కెటింగ్, ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి, శ్రమ అధికం. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..