Astrology: మార్చి 17, గురు దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించి జయం పొందుతారు. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
మిథునం : ఈరోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. స్త్రీలకు షాపింగ్ లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రుల కలయిక అనుకూలించక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. రావలసిన బకాయిలు వాయిదా పడతాయి. ఆత్యీయుల రాక ఆనందం కలిగిస్తుంది.
సింహం : ఈ రోజు ఈ రాశివారి విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ఆడిటర్లకు పని ఒత్తిడి, ప్లీడర్లకు నిరుత్సాహం తప్పవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. బ్యాంకు పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాల రీత్యా దూరప్రయాణాలు చేస్తారు.
కన్య : ఈ రోజు మీ సమర్థతపై భాగస్వామికులకు నమ్మకం కలుగుతుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా వుంచండి. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజంట్లుకు మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
తుల : ఈ రోజు ఈ రాశివారుఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలేర్పడతాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ కళత్రం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అయిన వారిని చూడాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారికి పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారికి ఉద్యోగ యత్నాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. రాజకీయ, పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక సమస్యలు తప్పవు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆందక సమస్యలు ఎదుర్కొంటారు. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుటవలన మంచి గుర్తింపు లభిస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ధనం విపరీతంగా వ్యయం చేసే మీ ధోరణిని మార్చుకోవటం శ్రేయస్కరం. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటలు ఎదుర్కుంటారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!