మేషం : ఈ రోజు ఈ రాశివారు సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించి జయం పొందుతారు.…