Eye Twitch Astrology: కన్నులు అదే పనిగా అదిరితే ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు కొందరు. మీకు ఓ విషయం తెలుసా ఇలా కన్నులు అదిరితే కేవలం భారతీయులు మాత్రమే భయపడరు.. విదేశాల్లో కూడా భయపడే వాళ్లు ఉన్నారు.. ఎందుకు ఉండరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన మన వాళ్లు ఉంటారు కదా అని అనుకుంటున్నట్లు ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగిన వాళ్లు కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇంతకీ మన దేశంలో ఏ కన్ను అదిరితే మంచిదో మీకు తెలుసా.. మగవారికి కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని, అదే ఆడవారికైతే ఎడమ కన్ను అదిరితే మంచిదని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు.
READ ALSO: Namo Bharat RRTS : భారత్‌లోనే వేగవంతమైన రైలు 160 Kmph స్పీడ్‌తో దూసుకెళ్లిన నమో భారత్
ఆడవాళ్లకు ఏ కన్ను అదిరితే సమస్యలు వస్తాయో తెలుసా..
ఆడవారికి కుడి కన్ను అదిరితే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మగవాడికి ఎడమ కన్ను అదిరితే సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే చైనీయులది మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.. అక్కడ మగవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని, ఆడవారికి కుడికన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు. అలాగే అమెరికా విశ్వాసం ప్రకారం.. ఎడమ కన్ను అదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు, బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు. అదే కుడి కన్ను అయితే ఆ ఇంట్లో త్వరలో పిల్లలు పుడుతారని విశ్వసిస్తారు.
చైనాలో.. ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడి కన్ను అదిరితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని విశ్వసిస్తారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఎడమ కన్ను అదిరితే కంగారు పడేది ఏదో జరుగుతుంది, కుడి కన్ను అయితే ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారని నమ్ముతారని పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 1-3 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయిని నమ్ముతారు. కుడి కన్ను అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది విశ్వసిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎడమ కన్ను అదిరితే త్వరలో కొంత ధనం కోల్పోతారు, కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతారు.
కన్నుశాస్త్రం ప్రకారం ఎక్కువ సేవు అలా కళ్లు అదురుతే మాత్రం కచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుందట. ఇదంతా కాదుకానీ సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్లే కాకుండా, నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధ సమస్యలు ఉన్నా అలా కళ్లు అదురుతాయట. కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరాయంగా కళ్లు అలా అదురుతుంటే వెంటనే సంబంధిత వైద్యులను కలవడం ఉత్తమని పలువురు సూచిస్తున్నారు.
READ ALSO: Japan Centenarians 2025: 100 ఏళ్ల క్లబ్‌లో మహిళలదే మెజారిటీ.. పాపం మగవాళ్లు