Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshaya Tritiya 2026: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. ఏడాదిలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజులలో ‘అక్షయ తృతీయ’ ఒకటి. ఈ సంవత్సరం ఏప్రిల్ 19న ఈ వేడుక జరగనుంది. ఆ రోజున చేసే దానధర్మాలు, పూజా కార్యక్రమాలు అక్షయమైన (తరిగిపోని) ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ ఏడాది అక్షయ తృతీయ కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని, సంపదను తీసుకురాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటి, వారికి కలిగే లాభాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PBKS vs SRH: ఆరెంజ్ ఆర్మీకి షాక్.. 220 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించిన పంజాబ్ కింగ్స్.!
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్షయ తృతీయ తిథిని ‘అబూజ్ ముహూర్తం’గా పరిగణిస్తారు. అంటే ఏ శుభకార్యానికైనా విడిగా ముహూర్తం చూడాల్సిన అవసరం లేకుండానే ఆ రోజున పనులు మొదలుపెట్టవచ్చు. ఆ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ రాశుల వారిపై కుబేరుడి కరుణ..
ఈ ఏడాది గ్రహాల స్థితిగతుల ప్రకారం.. అక్షయ తృతీయ పర్వదినం రోజున ఈ రాశుల వారికి విశేష ఫలితాలను ఇవ్వనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున వృషభ రాశి వీరికి ఆర్థిక పరంగా అద్భుతమైన సమయం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుబేరుడి ఆశీస్సులతో సంపద పెరుగుతుందని చెప్పారు. అలాగే సింహ రాశికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పేర్కొన్నారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుందని, ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉందన్నారు. వ్యాపారస్తులకు భారీ డీల్స్ కుదిరే అవకాశం ఉందని చెప్పారు. అక్షయ తృతీయ రోజున కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయన్నారు.
అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేయండి..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని, కుబేరుడిని భక్తితో పూజించాలి. ఆ రోజున మీకు వీలైతే బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయండి. అలాగే పేదలకు అన్నదానం లేదా వస్త్ర దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. పితృ దేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. మొత్తానికి ఏప్రిల్ 19న రాబోతున్న అక్షయ తృతీయ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జ్యోతిష్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
గమనిక: పైన పేర్కొన్న రాశిఫలాలు జ్యోతిష్య నిపుణుల అంచనాలపై ఆధారపడి ఉన్నాయి.
READ ALSO: Kitchen Tips: వారాల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!