Shah Rukh Khan: సెప్టెంబర్ 7న షారూఖ్ ‘జవాన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: ఈ ఏడాది ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ‘జవాన్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతి నెలా #AskSRK సెషన్‌లో షారూక్ ఖాన్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంటాడు. అందులో భాగంగా ఇటీవల ఫ్యాన్స్ తో మాట్లాడాడు షారూఖ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు షారూఖ్.
Read Also: Unfriendliest Cities: “అన్ ఫ్రెండ్లీ” నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ..
Also Read
ఇందులో షారూఖ్ ద్విపాత్రాభినయం చేయటం విశేషం. విజయ్ సేతుపతి, నయనతార, సాన్యా మల్హోత్రా, ప్రియమణి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూనె, ముంబై, హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్, ఔరంగాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. నిజానికి ఈ జూన్ లోనే ఆడియన్స్ ముందుకు రావలసి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్స్ లో జాప్యం వల్ల సెప్టెంబర్ 7న జన్మాష్ఠమి కానుకగా విడుదల కాబోతోంది.
Read Also: Balayya : బాలయ్య తో శ్రీదేవి నటించకపోవడానికి కారణం అదేనా..?
ఇక ఈ సినిమాలో విజయ్, సంజయ్ దత్, దీపికి పదుకొనె అతిథులుగా మెరవనుండటం ప్రత్యేక ఆకర్షణ కానుంది. దాదాపు 220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై షారూఖ్ సతీమణి గౌరీఖాన్ నిర్మిస్తున్నారు. మరి ‘పఠాన్’తో వచ్చిన సక్సెస్ ను షారూఖ్ ‘జవాన్’తోనూ కొనసాగిస్తాడేమో చూడాలి.
- Tags
- atli
- cinima
- Jawaan
- September 7
- shah rukh
తాజావార్తలు
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!